Indian student: ఇటలీ(Italy)లో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఝార్ఖాండ్(Jharkhand)లోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ ఎంబీఏ చదివేందుకు ఇటలీ వేళ్లాడు. అక్కడే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా అతనికి విషెస్ చప్పడానికి తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఎన్నిమార్లు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఒంటి ఓనర్‌కు ఫోన్ చేశారు. యజమాని రామ్ రౌత్ రూమ్‌లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్నాడు. ఇదే విషయాన్ని అతని తల్లిదండ్రులకు తెలియజేశాడు. దాంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తమ కుమారుడి బాడీని ఇండియాకు రప్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై జిల్లా డిప్యూటి కమిషనర్ రాష్ట్ర హోం శాఖ, ఝార్ఖాండ్ మైగ్రేషన్ విభాగానికి తెలియజేసినట్లు పేర్కొన్నారు. రామ్ రౌత్ బాడీని భారత్ రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.