»Pm Modi Giorgia Meloni India Italy Friendship G7 Summit Apulia
Melodi : హలో మెలోని టీమ్.. ప్రధానితో సెల్ఫీ దిగిన జార్జియా మెలోని
ఇటలీలోని అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం ముగిసింది. కానీ అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆతిథ్యం ఇవ్వడం, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
Melodi : ఇటలీలోని అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం ముగిసింది. కానీ అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆతిథ్యం ఇవ్వడం, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఏడు ప్రధాన దేశాల అధినేతలు ఒకే వేదికపై సమావేశమై వివిధ సమకాలీన అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమయం జార్జియా మెలోని ప్రముఖ అతిథులను సాదరంగా స్వాగతించారు. ముఖ్యంగా ప్రధాని మోదీతో కలిసి మెలోని సెల్ఫీ దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జీ7 సమ్మిట్ సందర్భంగా చేసిన ఈ వీడియోలో జార్జియా మెలోని ప్రధాని మోడీతో చాలా హ్యాపీ మూడ్‌లో కనిపించారు. వీడియోలో ఆమె మెలోని టీమ్‌లో మెంబర్‌గా ప్రధాని మోదీని పరిచయం చేస్తోంది. జార్జియా చేతులు ఊపుతూ చిరునవ్వుతో హలో… మెలోని టీమ్ అంటుంది. ఈ వీడియోలో ప్రధాని మోదీ కూడా నవ్వుతూ కనిపించారు.
జార్జియా మెలోని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో ఈ ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని మళ్లీ పోస్ట్ చేసి, లాంగ్ లైవ్ ఇండియా-ఇటలీ ఫ్రెండ్షిప్ అని రాశారు. అంటే, భారతదేశం, ఇటలీ మధ్య స్నేహం చిరకాలం ఉండాలి అన్నారు. ఈ ఏడాది జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియాలో జీ7 సదస్సు జరిగింది. ఇటలీ ఆతిథ్య దేశం. ఈ సదస్సుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాన అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీ జూన్ 13 సాయంత్రం ఇటలీకి బయలుదేరారు. అక్కడ జూన్ 14న జీ7 సభ్య దేశాల అధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా వచ్చి ప్రధాని మోదీని కలిశారు.