జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలోని కూటమి లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ఐదేళ్ల కోసం కాదని.. ఓ తరం కోసమన్నారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలోని కూటమి లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ఐదేళ్ల కోసం కాదని.. ఓ తరం కోసమన్నారు. జగన్ జైలుకు వెళ్లడం గ్యారంటీ అని మోదీ తెలిపారన్నారు. 30 కేసులు పెట్టుకుని జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. జగన్కు ఐదేళ్లు అవకాశం ఇస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని, ఉద్యోగ అవకాశాలు లేవని పవన్ అన్నారు. 5 కోట్ల ప్రజలకు తాము మాట ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మేలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు.
అలాగే కాకినాడలో రౌడీయిజం ఎక్కువైందని, గంజాయికి కేంద్రంగా మారిందని పవన్ అన్నారు. మా అభ్యర్థిని గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చేస్తానని.. గెలుపు తనదేనని పవన్ అన్నారు. జగన్ ప్రభుత్వం 27 దళిత పథకాలను తీసేసింది. ప్రభుత్వ పాలనలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారని పవన్ అన్నారు.