»Revanth Reddy Cm Revanth Who Expressed Anger On Kcr
Revanth Reddy: కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ మండిపడ్డారు.
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ మండిపడ్డారు. కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వమే మేడిగడ్డ విషయంలో తప్పుచేసినట్లు.. దానికి మేమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. రూ.94 వేల కోట్లు వథా అయి ప్రాజెక్టు దెబ్బతింటే.. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. కేంద్ర మంత్రి, సీఎం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి.. సీఎంపై అలాంటి భాష మాట్లాడతారా? ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పిన వీళ్ల తీరు మారలేదన్నారు.
ఓట్లేసి గెలిపించిన సీఎంను ఉద్దేశించి ఎవరైనా ఇలా మాట్లాడతారా? కేసీఆర్, హరీశ్రావుకే పెత్తనం ఇస్తాం. మేడిగడ్డలో నీళ్లు నింపి అక్కడి నుంచి అన్నారం, సుందిళ్లలో ఎత్తిపోయించే బాధ్యత మీరు తీసుకోండని రేవంత్ తెలిపారు. అయిన చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? ఆ అవసరం మాకేంటి? సానుభూతి కోసం వీల్ ఛైర్ నాటకాలు ఆడుతున్నారు? కాళేశ్వరంలో అవినీతికి పాల్పడకపోతే చర్చకు రావాలి? సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాలెందుకు? అని రేవంత్ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.