»Actress Pragathi Expressed Anger Over The News Of Her Second Marriage
Actress Pragathi : రెండవ పెళ్లి వార్తలపై మండిపడ్డ నటి ప్రగతి
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుంది అని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై స్పందించింది. ఏ ఆధారాలు లేకుండా ఇలా వ్యక్తిగత విషయాలపై ఎలా వార్తలు రాస్తారు అని మండిపడింది.
Actress Pragathi expressed anger over the news of her second marriage
Actress Pragathi: తెలుగు పరిశ్రమలో(Telugu industry) క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటు మంచి పేరు సంపాదించుకున్న నటి ప్రగతి (Actress Pragathi). ఈ మధ్య సోషల్ మీడియాలో సైతం తనదైన శైలీలో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా తాను రెండో పెళ్లి చేసుకోబోతుందని పలు మీడియా సంస్థలు, వెబ్సైట్లు వార్తలు ప్రచురించాయి. వాటిపై ప్రగతి అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత విషయాలపై ఎలా వార్తలు రాస్తారు అని మండిపడింది. సినిమా వాళ్లపై ఎలాంటి వార్తలైనా రాయోచ్చు అనుకోవడం తప్పు అని చెప్పింది. మీకు ఏ హక్కు ఉందని ఇతరుల గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోనుంది అని ఏ ఆధారాలతో రాశారు అని ప్రశ్నించింది. ఇలా రాసేముందు ఒకసారి చెక్ చేసుకోవాలి అని, హద్దులు మీరి రాయడం కరెక్ట్ కాదని తెలిపింది. అలాంటిది ఏమన్నా ఉంటే తానే చెప్తాను అని, ఇలా తొందరపడి రాయడం వలన ఏం వస్తుందని మండిపడింది.
హీరోయిన్ కావాలన్న ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగతి తొలినాళ్లలో కొన్ని సినిమాల్లో నటించింది. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి (Wedding) చేసుకున్న ప్రగతి.. ఆ తర్వాత భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుంది. ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా జీవితాన్ని గడుపుతోంది. తెలిసీ తెలియని వయసులో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. చిరుత, నువ్వు లేక నేను లేను, దూకుడు, డమరుకం, బద్రీనాథ్, డీజే టిల్లు (DJ Tillu) వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.