»And What Do You Like Naga Chaitanyas Second Marriage
Naga Chaitanya: ఇక మీ ఇష్టం.. నాగ చైతన్య రెండో పెళ్లి?
అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నిన్న మొన్నటి వరకు ససేమిరా అన్న నాగ చైతన్య.. ఇప్పుడు తండ్రి నాగార్జున ఇష్టం అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల గుస గుస.
And what do you like.. Naga Chaitanya's second marriage?
Naga Chaitanya: సమంత, చైతన్య విడిపోయినప్పటి నుంచి ఈ ఇద్దరు సెకండ్ మ్యారేజ్‌కు రెడీ అవుతున్నారనే మాట వినిపిస్తునే ఉంది. ఆ మధ్య సమంత పై ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారని.. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సామ్ కొన్నాళ్లు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉందని టాక్ నడిచింది. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. సమంత సంగతి పక్కన పెడితే.. ఈసారి మాత్రం నాగచైతన్య పెళ్లి ఫిక్స్ అయిపోయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇప్పటికే నాగార్జున అమ్మాయిని ఫిక్స్ చేశారని.. ఇండస్ట్రీతో సంబంధం లేని ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బయటికి చెప్పకపోయినా సెలెంట్‌గా పెళ్లికి ఏర్పాట్టు జరుగుతున్నట్టు భోగట్టా. నిన్న మొన్నటి వరకు పెళ్లి వద్దని చెప్పిన నాగ చైతన్య కూడా.. ఇపకపుడు మీ ఇష్టం నాన్న అని.. పెళ్లి నిర్ణయాన్ని తండ్రికి వదిలేసినట్టుగా తెలుస్తోంది.
అసలు ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. చైతన్య రెండో పెళ్లి అనే న్యూస్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అయినా కూడా దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాలతో చైతన్య డేటింగ్లో ఉన్నట్టుగా పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు చైతూ వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ప్రస్తుతం చైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మరి అక్కినేని ఫ్యామిలీ ఈ వార్తలపై స్పందిస్తుందేమో చూడాలి.