»Aishwarya Rajinikanth Blames Anirudh For 3 Movie Failure
Aishwarya Rajinikanth: తన సినిమా ప్లాప్కి కారణం అతనే అంటున్నఐశ్వర్య..!
ఐశ్వర్య రజనీకాంత్ తీసింది తక్కువ సినిమాలే అయిన తనదైన ముద్ర వేసుకుంది. అయితే తను దర్శకత్వం వహించిన 3 సినిమా ఫ్లాప్ అవడానికి ముఖ్య కారణం ఎవరో చెప్పేసింది.
Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ముద్దుల కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ అంటే తెలియని వారు ఉండరు. ఆమె పలు సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. దాదాపు 9 సంవత్సరాల తర్వాత రీసెంట్గా ఆమె మళ్లీ మెగా ఫోన్ పట్టారు. లాల్ సలామ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే.. ఆమె దర్శకత్వంలో వచ్చిన 3 మూవీ మాత్రం ఇప్పటికీ చాలా మంది యూత్కిి చాలా నచ్చిన సినిమా. ధనుష్ హీరోగా, శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఐశ్వర్య డైరెక్టర్‌గా మొదటి సినిమా.
ఆ తర్వాత 2014లో క్రైమ్ కామెడీ వై రాజా వాయ్‌కి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన లాల్ సలామ్
చిత్రానికి కూడా ఆమె దర్శకత్వం వహించారు. అయితే.. లాల్ సలామ్ తెలుగులో టోటల్ వాష్ అవుట్ అయ్యింది. తమిళంలో సగటు మౌత్ టాక్ , రివ్యూలతో తక్కువ బిజినెస్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అతిధి పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలాంటి హైప్ లేకుండా విడుదలైంది. లాల్ సలామ్ ప్రమోషన్ సందర్భంగా, ఐశ్వర్య తన తొలి చిత్రం ‘3’ ఫలితం గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది.
కొలవెరి పాటకు వచ్చిన బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందరినీ షాక్‌కి గురి చేసిందని, పాట భారీ విజయం సినిమా కంటెంట్‌ను కప్పివేసిందని ఆమె అన్నారు. చిత్రం కంటెంట్ చాలా సీరియస్‌గా ఉంటుందని, కానీ ఆ పాట చిత్రంపై భిన్నమైన అంచనాలను నెలకొల్పింది, దీని ఫలితంగా ప్రేక్షకులు నిరాశ చెందారని ఆమె అన్నారు. తన మూవీ హిట్ కాకపోవడానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కారణమని ఆమె చెప్పడం గమనార్హం. “ఈ చిత్రం ఇటీవలి రీ-రిలీజ్ సమయంలో మంచి ఆదరణ పొందింది, ఎందుకంటే ఆ పాట మ్యాజిక్ తగ్గిపోయింది. కానీ ఈ పాట అనిరుద్ కెరీర్‌కు సహాయపడినందుకు నేను సంతోషంగా ఉన్నాను అని ఐశ్వర్య చెప్పారు.