»Rakul Preet Singhs Jackie Bhagnani Wedding Card Is Viral
Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి కార్డు వైరల్..
హాట్ బ్యూటీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, ప్రముఖ్ నిర్మాత, యాక్టర్ జాకీ భగ్నానీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వీరి వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Rakul Preet Singh's Jackie Bhagnani wedding card is viral.
Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌పై గత కొంత కాలంగా పెళ్లి వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు జాకీ భగ్నానీతో పెళ్లి నిశ్చయం అయింది. వీరిద్దరు ఈ నెల 21న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ మేరకు వీరి వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ముద్రించారు. అలాగే కార్డుపై ‘అబ్దోనోభగ్నా-ని’అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ప్రింట్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్న రకుల్, జాకీ తమ వివాహానికి గోవాను ఎంచుకున్నారు. దీనివెనక కూడా ఓ కారణం ఉంది. వారిద్దరూ లవ్‌లో పడింది ఇక్కడేనట. జాకీ 2009లో ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫాల్తు, అజాబ్ గజాబ్ లవ్, రాంగ్రేజ్, యంగిస్థాన్ వంటి సినిమాల్లో నటించాడు.
2009లోనే కన్నడ సినిమా గిల్లీతో రకుల్ ప్రీత్‌సింగ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో తెలుగులో రంగప్రవేశం చేసింది. ఆ తరువాత యంగ్ హీరోస్ అందరితో సినిమాలు చేస్తూ.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ధృవ సినిమాలో అవకాశం దక్కించుకుంది. తరువాత కొండపొలం అనే చిన్న సినిమాలో నటించింది. ఇక బాలీవుడ్లో అడుగుపెట్టింది. వరుసగా దేదే ప్యార్ దే, రన్‌వే 34, చాత్రివాలీ, ఐ లవ్ యూ, డాక్టర్ జీ వంటి సినిమాల్లో నటించింది. ముందు వీరి విహహం మాల్దీవ్స్‌లో అనుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంతో వీరి డెస్టినేషన్ వెడ్డింగును గోవాకు మార్చుకున్నారు.