»These Are The Movies That Will Be Released In Theaters And Ott This Week 2
Movies Released: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే
ఆసక్తికరమైన కంటెంట్‌తో ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించే సినిమాల జాబితా, మీకు నచ్చిన సినిమాలు ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదల అవుతున్నాయో తెలుసుకుందాం.
These are the movies that will be released in theaters and OTT this week
Movies Released: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఎలాంటి సినిమాలు చేస్తున్నారో మనం చూస్తునే ఉన్నాము. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ఈయన తాజాగా మరో భిన్నమైన కథతో వస్తున్నారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో భ్రమయుగం (Bramayugam) అనే సినిమా రూపోందింది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని రాహుల్ సదాశివన్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ డైరెక్టర్ గతంలో భూతాకాలం అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాకు మంచి ఆధరణ లభించింది. దాంతో భ్రమయుగం చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కథ అల్లి, తెరకెక్కిన చిత్రం రాజధాని ఫైల్స్. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 15న విడుదలకు సిద్దం అయింది.
యంగ్ హీరో సందీప్‌కిషన్ (Sundeep Kishan) లీడ్ రోల్లో వి.ఐ.ఆనంద్ తెరకెక్కించిన మూవీ ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలు భైరవకోన అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆసక్తిని రేపాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనితో పాటు జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వర్ నటించిన చిత్రం సైరెన్ 108. అంబులెన్స్ డ్రైవర్ కిల్లర్ గా మారే కాథాంశంతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ఫిబ్రవరి 16న ప్రక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీ వేదికగా కేరళ స్టోరీ జీ5 డిజిటల్ ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి 16న అందుబాటులో వస్తుంది. అలాగే కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 17న విడుదల కానుంది. వీటితో పాటు హాలీవుడ్ సిరీస్, ఇతర భషాల చిత్రాలు కూడా విడుదల అవుతున్నాయి.