»Sovereign Gold Bond Scheme 2023 24 New Series Opens For Subscription
sovereign gold bonds : సోవరింగ్ గోల్డ్ బాండ్ స్కీమ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభం
పసిడి బాండ్లపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సోమవారం నుంచి సబ్స్క్రిప్షన్లు ప్రారంభం అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాము పసిడి ధరను రూ.6,263గా ప్రకటించింది.
Huge gold are recovered at vijayawada railway station
sovereign gold bonds: మన దేశంలో ఎంతో ఆదరణ పొందిన పెట్టుబడి పథకంగా సోవరింగ్ గోల్డ్ బాండ్స్ స్కీమ్(sovereign gold bond scheme) ప్రాచుర్యం పొందింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో నాలుగో దఫా సబ్స్క్రిప్షన్లు సోమవారం ప్రారంభం అయ్యాయి. భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకులు సంయుక్తంగా వీటిని విడుదల చేస్తాయి.
ఈ నాలుగో సిరీస్ సబ్స్క్రిప్షన్లకు గ్రాము పసిడి ధరను రూ.6,263గా ఆర్బీపై నిర్ణయించింది. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి మరో రూ.50 డిస్కౌంట్ ప్రకటించింది. అంటే ఆన్లైన్లో కొనుగోలు చేసేవారు గ్రామును రూ.6,213కు పొందవచ్చు. ఈ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారు కనిష్ఠంగా ఒక గ్రామును ఒక యూనిట్‌గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ గడువు ఎనిమిదేళ్లు. ఈ గడువు ముగిసిన తర్వాత అప్పుడు బంగారం రేటు ఎంత ఉంటే అంత డబ్బును మనకు చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత కావాలనుకుంటే దీని నుంచి వైదొలగవచ్చు. అందుకనే దీన్ని మంచి పెట్టుబడి పథకంగా అంతా భావిస్తున్నారు. నేరుగా బంగారం కొంటే తరుగు, మజూరీ, జీఎస్టీ లాంటివి అన్నీ ధరకు తోడవుతాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే గోల్డ్ బాండ్లను(gold bonds) ఎంచుకోవచ్చు.
ఈ పథకం కింద బాండ్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఒక ఆర్థిక సంవత్సరంలో .. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల్లోని వారు గరిష్ఠంగా నాలుగు కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. అదే ట్రస్టులు 20 కేజీల వరకు కొనుక్కోవచ్చు. మధ్యలో బాండ్లను బ్రేక్ చేయాలని అనుకుంటే సంబంధిత నిబంధనలు వర్తిస్తాయి.