»A New Threat To The Residents Of Pune The Frightening Mosquito Tornado
Mosquito Tornado: పూణెను భయపెడుతున్న దోమలు.. వీడియో వైరల్
మస్కిటో టోర్నడోలు మధ్య అమెరికా, రష్యాలలో వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు పూణెలో మొదలయ్యాయి. దీని వలన ఐటీ పార్క్‌లు, స్కూళ్లు, స్టేడియంలు, ఓల్డేజ్ హోంలో దోమలు చేరి దారుణంగా ఇబ్బంది పడుతున్నాయి.
A new threat to the residents of Pune The frightening mosquito tornado
Mosquito Tornado: పూణె వాసులను మస్కిటో టోర్నడో బెంబేలెత్తిస్తోంది. నగరంలోని ముఠానది మీద దోమలు సుడిగాలిలా తిరుగుతతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ముంధ్వా, కేశవ్‌నగర్, ఖారడీ ప్రాంతాల్లోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతాల్లోని భవనాల్లో నివసించే వారు బాల్కనీ డోర్లు తెరిచేందుకు భయపడుతున్నారు. పార్కులు, గార్డెన్లను మూసివేశారు. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు.
దోమలు వలన మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బుల వస్తాయని అందరికీ తెలుసు. ఖరాడీలోని ములా-ముఠా నదిలో దోమల విహారం చూస్తుంటే దారుణం అనిపిస్తుంది. ముఖ్యంగా, ఖరాడిలోని ములా-ముఠా నదిలో నీటి మట్టం పెరగడం వల్ల దోమలు భారీగా చేరాయి. అయితే పూణె మున్సిపల్ కార్పొరేషన్ నీటిని తొలగించే పనిని ప్రారంభించినప్పటికీ, పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. దీని పక్కనే ఉండే ఐటీ పార్క్‌లు, స్కూళ్లు, స్టేడియంలు, ఓల్డేజ్ హోంలో దోమలు చేరి దారుణంగా ఇబ్బంది పడుతున్నాయి. గతంలో ఇలాంటి మస్కిటో టోర్నడోలు మధ్య అమెరికా, రష్యాలలో వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి.