»40 People Suffer From Pood Poisoning After Eating Railway Food In The Train Going From Chennai To Pune
Food Poisoning: చెన్నై-పూణె ట్రైన్లో కలుషిత ఆహారం తిని 40 మందికి అస్వస్థత
రైలులో ప్రయాణిస్తూ.. దాంట్లో వడ్డించిన ఆహారం తిని 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చెన్నై నుంచి పూణెకు వస్తున్న భారత్ గౌరవ్ యాత్ర రైలులో రైల్వే ఆహారం తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.
Food Poisoning: రైలులో ప్రయాణిస్తూ.. దాంట్లో వడ్డించిన ఆహారం తిని 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చెన్నై నుంచి పూణెకు వస్తున్న భారత్ గౌరవ్ యాత్ర రైలులో రైల్వే ఆహారం తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. రైల్వేశాఖ అందిస్తున్న ఆహారం తిన్న దాదాపు 40 మంది ఫుడ్ పాయిజనింగ్కు గురైనట్లు సమాచారం. ప్రయాణికులందరినీ పూణేలోని సుసున్ ఆసుపత్రిలో చేర్చారు. రైలు అర్థరాత్రి పూణే రైల్వే స్టేషన్కు చేరుకోగానే, అస్వస్థతకు గురైన ప్రయాణికులందరికీ రైల్వే స్టేషన్లోనే ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత పూణేలోని సుసున్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రయాణికులందరి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ప్రయాణికులు అస్వస్థతకు గురైతే రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలకు ఆదేశించింది. ఆహారం అందిస్తున్న కంపెనీపై చర్యలు తీసుకుంటామని స్పష్టత ఇచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ వ్యవహారంలో కంపెనీపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. రైలులో ఆహారం తిన్న 40 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అందరి ఆరోగ్యం బాగానే ఉందని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం పుణెలోని సుసున్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరలో డిశ్చార్జి కానున్నారు.