TG: వేసవి దృష్ట్యా రాబోయే మూడు నెలలు తాగునీటి కొరత రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలు నీటిని వృథా చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, లీకేజీలు లేకుండా పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతిరోజూ నీటి సరఫరాపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.