చాలామందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. బంగారాన్ని మదుపు చేయాలనుకున్న వాళ్లకి కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ జారీ సంగతి తెలిసిందే. అయితే వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేయడం ఎలాగో తెలుసుకుందాం.
Gold Bonds: చాలామందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. బంగారాన్ని మదుపు చేయాలనుకున్న వాళ్లకి కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ జారీ సంగతి తెలిసిందే. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్స్క్రిప్షన్ ఈ నెల 12న ప్రారంభమై 16 వరకు అందుబాటులో ఉంటుంది. బంగారం ధరను ఆర్బీఐ త్వరలో ఖరారు చేయనుంది. అయితే ఈ గోల్డ్ బాండ్లలో కనీసం ఒక గ్రాము బంగారం అయిన కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని షేడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుర్తింపుపొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఎస్జీబీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
బాండ్ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50% ఫిక్స్డ్ రేటుతో అర్థ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. బాండ్ల కాలవ్యవధి 8 ఏళ్లు. బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై ఎస్జీబీ పన్ను మినహాయింపును అందిస్తుంది. బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్ బాండ్లను పరిశీలించాలి. వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేయాలంటే మీ నెట్‌బ్యాంకింగ్‌కు లాగిన్ కావాలి. తర్వాత మెనూలో ఈ సర్వీసెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ అనే సెక్షన్లో సావరిన్ గోల్డ్ బాండ్ ఆప్షన్ ఎంచుకోవాలి. టర్మ్స్ అండ్ కండీషన్స్ చదివి తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి.
సావరిన్ గోల్డ్ బాండ్‌కు అవసరమైన వివరాలు ఇచ్చి డిపాజటరీ పార్టిసిపేట్ను ఎంచుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫారాన్ని సమర్పిస్తే.. పర్చేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఇవ్వాలి. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే కాకుండా ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ వెబ్సైట్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. లేదంటే దగ్గర్లోని బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీసుకు వెళ్లి కూడా ఫారాన్ని నింపాల్సి ఉంటుంది.