Chennai : నడిరోడ్డుపై రూ.535 కోట్లతో నిలిచిపోయిన కంటైనర్
చెన్నై (Chennai) నుంచి కోట్ల 535 నగదుతో బయల్దేరిన కంటైనర్ వాహనం మరమ్మతు లకు గురై రోడ్డుపై నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ధనం మూలం ఇదం జగత్ అంటుంటారు. ఉదయం నిద్ర లేచింది మొదలు డబ్బు (money) కోసమే పని చేస్తుంటాం అనేది కాదనలేని సత్యం. అలాంటి డబ్బు నడి రోడ్డుపై కనిపిస్తే ఏం చేస్తారా..? ఎవ్వరు చూడకుండా ఆనగదును తీసి జేబులో పెట్టుకునే వాళ్లు ఎందరో. అయితే.. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు వందల కోట్లతో లారీ రోడ్డుపై ఆగింది. తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం చెన్నైలో వందల కోట్ల నగదును తరలిస్తున్న ఓ ట్రక్ బ్రేక్‌డౌన్ కావడంతో నడిరోడ్డుపై నిలిచిపోయింది.రిజ్వర్ బ్యాంక్ (Reserve Bank) నుంచి రూ. 535 కోట్లను రోడ్డు మార్గంలో విల్లుపురా(Villupuram)నికి తరలిస్తుండగా ట్రక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ట్రక్‌లో నగదు ఉన్నట్టు తెలుసుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో పోలీసులు ఘటన స్థలంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.