»Mega Family In Italy Ram Charans Daughter Klin Kaara Face Reveal In An Innovative Way
Mega Family: ఇటలీలో మెగా ఫ్యామిలీ..వినూత్నంగా రామ్‌చరణ్ కూతురు ‘క్లీంకారా’ ఫేస్ రివీల్
ఇటలీలో మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహానికి మెగా ఫ్యామిలీ మొత్తం తరలివెళ్లింది. ఈ తరుణంలో కుటుంబ సభ్యులంతా ఫోటోలు తీసుకోగా, అందులో వినూత్నంగా క్లీంకారా ఫోటో రివీల్ అయ్యింది. దీంతో మెగా ఫ్యాన్స్ క్లీంకారా ఫేస్‌ను మొదటిసారి చూసినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొణిదెల వారింట పెళ్లి సందడి నెలకొంది. నవంబర్ 1వ తేదిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు ఇటలీ వేదిక కానుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ (Mega Family) మొత్తం ఇటలీలోని టుస్కానీ ప్రాంతానికి చేరుకుంది. కొణిదెల ఫ్యామిలీతో పాటుగా కామినేని కుటుంబం కూడా టూర్‌కి వెళ్లి సెలవులను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మెగా ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (RamCharan)తో పాటుగా కామినేని ఫ్యామిలీతో కలిసి మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఉంది. తాజాగా ఆ ఫోటోను నెట్టింట ఉపాసన పోస్ట్ చేసింది. అయితే ఎప్పటిలాగానే క్లీంకారా ఫేస్‌కు లవ్ సింబల్ ఎమోజీతో కవర్ చేసి ఫోటోను షేర్ చేశారు. కాకపోతే ఫోటోను నీటి ముందు తీయడంతో ఆ నీటిలో పాప ఫేస్ క్లియర్‌గా కనిపిస్తోంది. పాప ప్రతిబింబం నీటిలో కనిపించడంతో తొలిసారి అభిమానులంతా రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీమ్ కారాను చూసినట్లు అయ్యింది.
నెట్టింట క్లీంకారా ఫోటో తెగ వైరల్ (Klin Kaara Photo Viral) అవుతోంది. మరోవైపు వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripati)ల పెళ్లికి పవన్ తన భార్య అన్నాతో కలిసి ఇప్పటికే చేరుకున్నారు. నవంబర్ 1వ తేదిన పెళ్లి తర్వాత 5వ తేది హైదరాబాద్ (Hyderabad)లో పెళ్లి రిసెప్షన్ వేడుకగా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలంతా హాజరుకానున్నారు.