స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్న సమంత.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు ఇందులో నిజముందా?
Samantha: నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా మానసికంగా ఇబ్బంది పడింది సమంత. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేజ్ చేయాల్సి వచ్చింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు కూడా దూరమైంది. ప్రస్తుతం ఒంటరిగానే స్ట్రగుల్ అవుతోంది. విదేశాలకు, వెకేషన్లకు తిరుగుతోంది. అయితే.. రీసెంట్‌గానే సిటాడెల్ వెబ్ సిరీస్ డబ్బింగ్ స్టార్ట్ చేసి.. సామ్ ఈజ్ బ్యాక్ అనే న్యూస్ చెప్పింది. కానీ సమతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. నిర్మాతగా సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది గానీ.. హీరోయిన్గా ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. దీంతో ఇక పై సమంతను హీరోయిన్గా చూడలేమా? అనే సందేహాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆ మధ్య సమంత పై ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారని.. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే సామ్.. సోషల్ మీడియాకు దూరంగా ఉందనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు.. సమంత అమ్మతనానికి దూరంగా ఉండడానికి షాకింగ్ డెషిషన్ తీసుకుందని టాక్ కూడా నడిచింది. కానీ లేటెస్ట్గా సమంత మనసు మార్చుకొని రెండో పెళ్లికి రెడీ అయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈసారి సినిమా వాళ్లను కాకుండా.. అసలు ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చూస్తోందట. తమ ఫ్యామిలీ రిలేషన్‌లోనే ఓ వ్యక్తిని సమంత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందనే న్యూస్ వైరల్ అవుతుంది. అతను ఎవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. కానీ అసలు సమంత పెళ్లి చేసుకుంటుందా? లేదా? అనేదే ఇక్కడ అందరి డౌట్. మరి దీనిపై సమంత క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.