Siddu Jonnalagadda: జాక్.. కొంచెం క్రాక్‌గా సిద్ధు జొన్నలగడ్డ!
డీజె టిల్లుగా తన యాసతో దుమ్ముదులిపేశాడు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌తో చేస్తున్న కొత్త మూవీకి.. తాజాగా టైటిల్ అనౌన్స్ చేశారు.
Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ.. నెక్స్ట్ టిల్లు స్క్వేర్తో రచ్చ చేయడానికి వస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న టిల్లు స్క్వేర్ మార్చ్ 29న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత క్లాస్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు సిద్ధు. SVCC 37గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్గా బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఇప్పటికే ఆమె లుక్ రివీల్ చేయగా.. సిద్దు, వైష్ణవి పెయిర్ ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీల్ కలిగించింది. ఇక ఫిబ్రవరి 7న సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా.. సిద్ధుకు బర్త్ డే విష్ చేస్తూ ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు.
ఈ చిత్రానికి ‘జాక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొంచెం క్రాక్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఈ మూవీలో సిద్దు పాత్ర క్రాక్‌గా ఉంటుందని చెబుతూ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో సిద్ధు గన్స్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. దీంతో జాక్‌లో ఫన్‌తో పాటు ఫుల్ యాక్షన్ కూడా ఉంటుందని చెప్పేశారు మేకర్స్. గత కొంత కాలంగా బొమ్మరిల్లు భాస్కర్ సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. దీంతో జాక్‌తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. సిద్ధు కూడా టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలకు తగ్గకుండా జాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని SVCC పతాకంపై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి జాక్.. కొంచెం క్రాక్ ఎలా ఉంటుందో చూడాలి.