»Vijayashanthi Glimpses Of Vijayashanthi Released From Kalyan Rams Movie Vijayashanthi Ips
Vijayashanthi: కళ్యాణ్ రామ్ సినిమా నుంచి విజయశాంతి గ్లింప్స్ రిలీజ్.. వైజయంతీ ఐపీఎస్
చాలా కాలం తర్వాత మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Vijayashanthi: Glimpses of Vijayashanthi released from Kalyan Ram's movie.. Vijayashanthi IPS
Vijayashanthi: సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయ శాంతి పాత్ర హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత మరో సినిమా చేయలేదు ఆమె. కానీ ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో నటిస్తోంది. బింబిసారతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్.. చివరగా ‘డెవిల్’గా ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ప్రస్తుతం NKR21 వర్కింగ్ టైటిల్‌తో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
గత ఏడాదే మొదలైన ఈ సినిమాలో.. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా , సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా విజయశాంతి బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌తో పాటు స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఇందులో ఆమె వైజయంతి ఐపీఎస్‌గా కనిపింంచింది. ‘వైజయంతి ఐపీఎస్. తను పట్టుకుంటే.. పోలీస్ తుపాకికి ధైర్యం వస్తుంది. వేసుకుంటే.. యునిఫామ్కి పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం.. మేమే తన సైన్యం’ అనే డైలాగ్స్‌తో ఈ గ్లింప్స్ అదిరింది. ఈ గ్లింప్స్‌లో కళ్యాణ్ రామ్ కూడా కనిపించాడు. గతంలో పలు సినిమాల్లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా నటించింది విజయశాంతి. ఇక ఇప్పుడు మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపింనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.