»Ravi Teja Harish Shankar Mr Bachchan First Look On Valentines Day
Mr. Bachchan: ఆసక్తిరేపుతున్న రవితేజ మిస్టర్ బచ్చన్ ఫస్ట్ లుక్
వరుస సినిమాలతో అలరిస్తున్న మాస్ మహారాజ రవితేజ తాజాగా రోమాంటిక్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది మరో మిరపకాయ్ అవుతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Ravi Teja, Harish Shankar Mr. Bachchan First Look on Valentine's Day
Mr. Bachchan: మాస్ మహారాజ రవితేజ(Ravi Teja), డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా మిస్టర్ బచ్చన్( Mr. Bachchan). ముచ్చటగా మూడో సారీ వీరి కలయికలో వస్తున్న సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ రూపోందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. వాలెంటెన్స్ డే సందర్భంగా విడదలైన ఫస్ట్ లుక్‌లో హీరోయిన్ హీరోల రోమాంటికి ఫోజ్‌ను విడుదల చేశారు.
కుర్చిలో కూర్చున్న రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని రొమాంటిక్‌గా హగ్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన రవితేజ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాములుగానే రవితేజ్ అమితాబ్ బచ్చన్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇక ఆయన టైటిల్‌తో చిత్రం అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే గతంతో డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కలయికలో వచ్చి మిరపకాయ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తాజా పోస్టర్ కూడా మిరపకాయ్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అదే ఎనర్జీ, అదే కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందని మేకర్స్ తెలిపారు. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన ‘ఈగల్’ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతోన్న విషయం తెలిసిందే.