ఆగష్టు 14న ప్రీమియర్ షోస్ తో భారీగా విడుదల అయిన రవి తేజ మిస్టర్ బచ్చన్ చిత్రం మిశ్రమ స్పాండన అందుకుంది. ప్రీమియర్ టాక్ తోనే సెకండ్ హాఫ్ రిపోర్ట్ దారుణంగా చెప్పారు. రవి తేజ్ ఫ్యాన్స్ సైతం డైరెక్టర్ హరీష్ శంకర్ ను దూషించారు. ఐతే జరిగిన డామేజే ని కంట్రోల్ చేయడానికి హరీష్ శంకర్ సినిమాలో కొన్ని సీన్స్ తొలగించాలని ఫిక్స్ అయ్యాడు. ఈరోజు సెకండ్ షోల నుండి సినిమాలో ఎక్కువుగా ఉన్న హిందీ పాటలు తొలిగిస్తున్నట్టు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసారు.
చిత్ర విమర్శకులు, ప్రేక్షకులు అందించిన అభిప్రాయాల ఆధారంగా కొన్ని సీన్లు తొలగించడం, సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుండేలా చేయొచ్చని భావించినా, ఈ నిర్ణయం పాజిటివ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. గతంలో ఎన్నో సినిమాలకు ఈ తరహా ప్రమోషన్స్ చేసినా జనాలు థియేటర్లకు రాలేదు
మిస్టర్ బచ్చన్ తో పాటు డబుల్ ఇస్మార్ట్ కి కూడా మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో కూడా అలీ కామెడీ ట్రాక్ పూర్తిగా మిస్ ఫైర్ అని టాక్ నడుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ లో కూడా కొన్ని స్కీన్లు తొలిగిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఏదిఏమైనా బొమ్మ పడ్డాక, డివైడ్ టాక్ వచ్చాక ఎన్ని చేసిన ప్రయోజనం ఉండదని అంటున్నారు సినీ అభిమానులు