తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హై కోర్ట్ జూలై 1న కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఆ పిటిషన్ ను సవాలు చేస్తూ సుప్రీమ్ కోర్ట్ లో బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశారు. సోమవారం ఇది విచారణకు రానుంది. ఢిల్లీ మద్యం విధాన కుంభకోణంలో రిమాండ్ లో ఉన్న కవిత బెయిల్ పై విడుదల అవుతారని BRS నేతలు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ కేసు చుట్టూ జరిగే పరిణామాలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఇటీవల, ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలకమైన నిందితుడు మనీష్ సిసోదియా బెయిల్ పొందిన విషయం తెలిసిందే. కవితకు కూడా ఇలాంటి అనుకూలత వచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ (KTR) తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “సిసోదియా బెయిల్ పొందడంతో కవితకు కూడా న్యాయస్థానంలో ఇలాంటి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.
సుప్రీమ్ కోర్ట్ బెయిల్ మంజూరు చేయడం తో 17 నెలలు తరువాత మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. మార్చ్ 15న కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నేపధ్యం లో ED అరెస్ట్ చేసింది