»What Kcr Tell About Ed Notices To Daughter And Mlc Kavitha
KCR: బీజేపీ కక్ష సాధింపు చర్యలు, కవితకు అందుకే నోటీసులు
కక్ష సాధింపులో భాగంగానే తన కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు, సమన్లు వచ్చాయని , ఉద్యమ సమయంలోను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆమెకు ధైర్యం చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాటి కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారని తెలుస్తోంది .
కక్ష సాధింపులో ( political vendetta ) భాగంగానే తన కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ( ED notices to MLC Kalvakuntla Kavitha ) , సమన్లు వచ్చాయని , ఉద్యమ సమయంలోను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆమెకు ధైర్యం చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana) , భారత రాష్ట్ర సమితి ( Bharata Rastra Samithi ) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ( Kalvakuntla Chandrasekhar Rao ) గురువారం నాటి కేబినెట్ సమావేశంలో ( Cabinet Meeting ) వ్యాఖ్యానించారని తెలుస్తోంది . ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ ( BJP ) ఆటలు తెలంగాణలో ( Telangana ) సాగవని, ఇప్పటికే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఈ మీటింగ్ లో ధైర్యం చెప్పారని తెలుస్తోంది . బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తెలంగాణ పైన (Telangana) , తన పైన కక్ష కట్టిందని, ఎందుకంటే మిగతా రాష్ట్రాలలో… మిగతా పార్టీలతో పోలిస్తే ఆ పార్టీ పైన మనమే ఎక్కువగా దాడి చేస్తున్నామని వ్యాఖ్యానించారని తెలుస్తోంది . రాష్ట్ర అభివృద్ధికి , పాలనకు అడ్డంకులు సృష్టించడంతో పాటు పార్టీ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు . ఇందుకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు . ఆ పార్టీ ఎత్తులను మనం చిత్తు చేయాలని , పార్టీ పరంగా పోరాడటంతో పాటు న్యాయ పరంగా పోరాడుదామని , భావసారూప్య పార్టీలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుదామని కేబినెట్ మీటింగ్ లో (cabinet meeting) చెప్పారని సమాచారం . రాష్ట్రంలో గవర్నర్ (Telangana Governor) వద్ద పెండింగుల బిల్లుల అంశాన్ని (Pendint Bills at Telangana governor) తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు . వీటిపై ఇప్పటికే సుప్రీం కోర్టులో (Supreme Court) కేసు వేశామని , రాష్ట్రపతి కి (President) కూడా ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు .
ఎన్నికలు మరెంతో దూరంలో లేవని, మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉందని, కాబట్టి అభివృద్ధి పైన దృష్టి సారించాలని సూచించారు. బీజేపీ చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ఆగడాలకు లెక్క లేకుండా పోతోందని, అన్నింటా వివక్ష కనిపిస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా తనను ఏం చేయలేని పరిస్థితుల్లో విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలకు ఎర కేసును రాష్ట్రంలో జరగకుండా ప్రయత్నాలు చేస్తోందన్నారు. కూతురు కవితకు నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందా లేదా చెప్పకుండా బీఆర్ఎస్ అగ్రనాయకుల నుండి చిన్నస్థాయి నేతల వరకు.. కవితకు నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణపై కక్ష సాధింపుగా ఎలా పరిగణిస్తారని ప్రతిపక్షాలు మొదటి నుండి ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, వారిపై చర్యలు తీసుకుంటే తెలంగాణకు ఏం సంబంధమని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కాగా, కేబినెట్ సమావేశం సందర్భంగా అధికారిక అజెండా తర్వాత అధికారులను బయటకు పంపించాక రాజకీయాలు మాట్లాడినట్లుగా తెలుస్తోంది.