AP: శాసనమండలి సభా హక్కుల కమిటీ ఇవాళ అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం కానుంది. మండలి ఛైర్మన్ మోషేనురాజు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, పి.చంద్రశేఖర్ రెడ్డి తదితరుల ఫిర్యాదులకు బాధ్యులైన అధికారులు వివరణ ఇవ్వాలని కమిటీ వారికి సమన్లు జారీ చేసింది. మంత్రి లోకేష్ ఫిర్యాదుపై డీఐజీ అమ్మిరెడ్డి గత సమావేశంలో కమిటీ ముందు వివరణ ఇచ్చారు.