ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ అధికారులు ఎనిమిది గంటలుగా విచారిస్తున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ అధికారులు (ED officers) ఎనిమిది గంటలుగా విచారిస్తున్నారు. ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఈడీ (enforcement directorate) ఎదుట విచారణకు హాజరయ్యారు కవిత (ed enquiry). ఈడీ కార్యాలయంలోని (ED Office) మూడో ఫ్లోర్ లో ఆమెను విచారిస్తున్నారు. కవిత విచారణ జరుగుతుండగానే సాయంత్రం కవిత అడ్వోకేట్ కు (Advocate) కబురు పంపింది ఈడీ. దీంతో సాయంత్రం ఏడు గంటల లోపు కవిత లీగల్ టీమ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నది. ఈ లీగల్ టీమ్ లో సోమా భరత్ (Soma Bharat) కూడా ఉన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ (Devi Prasad) ఉన్నారు. ఈడీ అడిగిన పలు పత్రాలను సోమా భరత్ తెచ్చి అందించారు.
కవిత విచారణ (Kavitha ED enquiry) నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పుడేం జరుగుతుందనే అంశంపై ఆరా తీస్తోంది. కేటీఆర్ (Minister KTR) సహా పలువురు మంత్రులు ఇప్పటికే ఢిల్లీలో (New Delhi) మకాం వేసారు. ఈడీ కార్యాలయం వెలుపల బీఆర్ఎస్ (BRS), జాగృతి శ్రేణులు (Jagruthi) పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఈడీ కార్యాలయం, సమీపంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు.
కవిత (MLC Kavitha) విచారణ వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో భర్త అనిల్, న్యాయవాదులతో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ధ్వంసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో పాత ఫోన్లను తీసుకెళ్లి ఈడీ అధికారులకు ఆమె అప్పగించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లడానికి ముందు ఇవే ఫోన్లను మీడియాకు చూపించారు. ఫోన్ల ధ్వంసంపై దురుద్దేశంతోనే లీకులు ఇచ్చి దుష్ప్రచారం చేశారని తప్పుబడుతూ ఈడీకి ఓ లేఖ రాశారు. అంతకుముందు మొదటిసారి 11వ తేదీన కవితను విచారించిన ఈడీ, సోమవారం రెండోసారి విచారించింది. మంగళవారం కూడా విచారణ కొనసాగుతోంది. సోమవారం ఈడీ అధికారులు 14 ప్రశ్నలు సంధించారు. మంగళవారం విచారణలో ఏం ప్రశ్నిస్తున్నారు? ఈ రోజు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? ఫోన్లలోని డేటా గుర్తించి ఏమైనా విశ్లేషణ చేస్తారా? ఈ కేసులో ఆధారాలను దొరకబడతారా? ఆమెను ఇంటికి పంపిస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ అందరిలోను నెలకొన్నది.