కోనసీమ: విద్యార్థులు వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈవో నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులందరూ వాట్సాప్ ద్వారా ‘మనమిత్ర’ మొబైల్ నెంబర్ 9552300009 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు సులభంగా డౌన్లోడ్కు ఈ విధానం అమలు చేసిందన్నారు.