Valentine’s Day: వాలెంటైన్స్ డే ఉపాసన స్పెషల్ ఫొటో.. వైరల్
ప్రేమికుల రోజును పురస్కరించుకొని కొణిదెల ఉపాసన కామినేని తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తమ పదకొండేళ్ల ప్రేమకు గుర్తుగా అంటూ పెట్టిన ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది.
Valentine’s Day: వాలెంటైన్స్ డే(Valentine’s Day) సందర్భంగా హీరో రామ్ చరణ్(Ram charan) సతీమణి ఉపాసన ఓ ఫొటోను సోషల్ మీడియాలోపంచుకున్నారు. పదకొండేళ్ల ప్రేమకు ప్రతిరూపం అంటూ రామ్ చరణ్, కూతురు క్లీంకార(Klin kara) చేతిలో చేయి వేసిన ఓ ఫోటోను పంచుకున్నారు. మెగా అభిమానుల కోసం ఈ ఫొటోను షేర్ చేసుకున్నారు. పేరెంట్స్ చేతుల్లో మెగాప్రిన్సెస్ చిట్టి చేతిని చూసి అభిమానులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. బెస్ట్ కపూల్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్కీ డాటర్ అంటూ మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అపోలో హాస్పిటల్ కో ఫౌండర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన, మెగా హీరో రామ్ చరణ్ స్నేహితులు. ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఉపాసన మాత్రం ఇండస్ట్రీలో కాకుండా వైద్యరంగంలో, సామాజిక సేవారంగంలో ఉన్నతిని సాధిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మెగా ఫ్యామిలీ అభిమానులతో టచ్ లో ఉంటారు. చరణ్, ఉపాసన ప్రేమకు గుర్తుగా పదకొండేళ్ల తరువాత కూతురు పుట్టిన విషయం తెలిసిందే.