»Srileela Told The Qualities That A Future Husband Should Have
Srileela: వాడే నా మొగుడు.. శ్రీలీల షాకింగ్ కామెంట్స్
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది శ్రీలీల. స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు రాకుండా వరుస ఆఫర్స్ అందుకున్న శ్రీలీల.. ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఇలాంటి సమయంలో ఈ ట్రెండింగ్ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Srileela told the qualities that a future husband should have
Srileela: పెళ్లి సందడి అనే ఒకే ఒక్క సినిమా.. శ్రీలీలకు ఏకంగా అర డజనుకు పైగా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. పెళ్లి సందడి సినిమా తర్వాత ధమాకా సినిమాలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన శ్రీలీల.. పర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా ఆఫర్లు అందుకోలేకపోయింది. ఒక్క భగవంత్ కేసరి తప్పితే శ్రీలీల చేసిన సినిమాల్లో ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. రీసెంట్గా వచ్చిన గుంటూరు కారంలోను డ్యాన్స్‌కే పరిమితమైంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది. దీంతో శ్రీలీల కెరీర్ డేంజర్ జోన్లో ఉందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు శ్రీలీల గురించి పెద్దగా రూమర్స్ స్ప్రెడ్ కాలేదు. మామూలుగా అయితే.. ఏ హీరోయిన్ అయినా సరే.. ఫలానా హీరోతోనో? లేదంటే ఇంకొకరితోనో? సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే గాసిప్స్ వినిపిస్తుంటాయి.
కానీ శ్రీలీల విషయంలో మాత్రం అలాంటి వాటికి చోటు లేకుండానే ఉంది. కానీ తనకు కాబోయే మొగుడు మాత్రం బ్రెయిన్ లెస్‌గా ఉన్న వాడే కావాలని అంటోంది. లేటోస్ట్గా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ‘ఒరిజినల్’ టాక్ షో స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఎపిసోడ్‌కి శ్రీలీల గెస్ట్‌గా వచ్చింది. ఈ ఒరిజినల్ టాక్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా వైరల్‌గా మారింది. ఫుల్ ఫన్నీగా ఉన్న ఈ ప్రోమోలో.. మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా, లేదా ఫన్నీగా జోవియల్‌గా ఉండే అబ్బాయి కావాలా అని అడిగింది సదరు యాంకర్. దానికి శ్రీలీల.. ఫన్నీ, జోవియల్ అబ్బాయే కావాలి.. బ్రెయిన్‌తో చేసే పనులు నేను చూసుకుంటాను.. అని నవ్వుతూ చెప్పింది. ఈ లెక్కన.. శ్రీలీలకు బ్రెయిన్ లేని వాడే మొగుడుగా కావాలని చెప్పేసిందన్న మాట. మరి అమ్మడికి అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడో చూడాలి.