AP: క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా మన్యం జిల్లా భామిని మోడల్ స్కూల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఫిన్లాండ్, ఇంగ్లండ్ దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతామన్నారు. అలాగే.. ‘లీప్ యాప్’ ద్వారా పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు నేరుగా తెలుసుకోవచ్చని చెప్పారు.