SDPT: ములుగు మండలం కొత్తూరు నూజివీడు సీడ్ కంపెనీలో రూ. 57.50 లక్షల విలువైన 9968 కిలోల విత్తనాల చోరీకి పాల్పడిన పలువురిని అరెస్టు చేసినట్లు గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ఎస్సై రఘుపతి తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి చోరీలకు పాల్పడినట్లు వివరించారు. సెక్యూరిటీ పందిరి రమేష్, మరో 9 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.