SDPT: ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రచారానికి వాహనాన్ని ఉపయోగించినందుకు హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ సర్పంచ్ అభ్యర్థి రవీందర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని హెచ్చరించారు.అనుమతులు లేకుండా ప్రచార వాహనాలు, మైకులు వాడ రాదన్నారు.