BDK: కలెక్టరేట్లో శుక్రవారం సాయుధ దళాల దినోత్సవ పతాక నిధి కార్యక్రమాన్ని ప్రారంభించి, తొలి విరాళాన్ని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అందించారు. దేశ రక్షణలో సైన్యం చేస్తున్న త్యాగాలను ప్రతి భారతీయుడు గౌరవించాలని అన్నారు. సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న సైనికుల కోసం ప్రతి పౌరుడు పతాక నిధికి సహకరించడం సామాజిక బాధ్యత అని అన్నారు.