BDK: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. రేగళ్ల పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ సందర్శించారు. అక్కడ విధులలో ఉన్న పోలీస్ అధికారులు, ఎన్నికల అధికారులను నామినేషన్ ప్రక్రియ సరళిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న వాహన తనిఖీల రిజిస్టర్లు పరిశీలించారు.