E.G: గండేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజల హాజరయ్యి తమ సమస్యల వినతులను ఎమ్మెల్యేకు సమర్పించుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు.