NLG: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి, డిసెంబర్ 8,9 తేదీల్లో హైదరాబాద్లో జరుగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 కు విచ్చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వానం అందజేశారు. దావోస్ ఆర్థిక ఫోరం తరహాలో జరిపే గ్లోబల్ సమ్మిట్ గురించి మంత్రి, చంద్రబాబు నాయుడుకు వివరించారు.