»Anushka As Odisha Girl A Movie Based On Real Incidents
Anushka: ఒడిశా అమ్మాయిగా అనుష్క? రియల్ ఇన్సిడెంట్స్తో సినిమా?
ఈ మధ్య అనుష్క ఓ హోటల్లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో అనుష్క ఒరిజినల్ వీడియో కాదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిటనట్టుగా చెబుతున్నారు.
Anushka as Odisha girl? A movie based on real incidents?
Anushka: చివరగా ‘మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క శెట్టి. ఈ సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవలేదు స్వీటి. కానీ ఇప్పుడు క్రిష్‌తో కొత్త సినిమాకు సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా అనుష్క ఓ హోటల్లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ అనుష్క ప్రజెంట్ ఏం చేస్తుంది? ఎలాంటి సినిమాలు చేయబోతోందనే విషయంలో క్లారిటీ లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ప్రజెంట్ అనుష్క షూటింగ్‌తో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. డైరెక్టర్ క్రిష్‌తో అనుష్క ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా సమాచారం. హరిహర వీరమల్లు తిరిగి సెట్స్ పైకి వెళ్లేలోపు అనుష్కతో సినిమా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట క్రిష్. అంతేకాదు.. ఇప్పటికే షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోందట. గతంలో వేదం సినిమా కోసం కలిసి పని చేశారు క్రిష్, అనుష్క. ఆ సినిమాలో సరోజ పాత్రలో అదరగొట్టింది అనుష్క.
ఇక ఇప్పుడు అనుష్కతో మరో అదిరిపోయే సినిమా చేస్తున్నాడట క్రిష్. ఈ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోందట. ఒడిశాలో ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిశా అమ్మాయి చేసిన పోరాటమే.. అనుష్క కొత్త సినిమా కథ అని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఒడిశా బ్యాక్ డ్రాప్ కావడంతో.. అక్కడే షూటింగ్ చేస్తున్నారట. రీసెంట్గా అనుష్క హోటల్లో కనిపించిన వీడియో ఈ సినిమా షూటింగ్ స్పాట్లోనిదే అని అంటున్నారు. మరి క్రిష్, అనుష్క ఈ సినిమాతో ఎలా మెప్పిస్తారో చూడాలి.