అదేంటో గానీ.. ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఒకరి హీరోయిన్ను ఇంకొకరు మారుస్తున్నట్టుగానే ఉంది వ్యవహారం. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది.
Ram Charan: ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆర్సీ 16లో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది జాన్వీ కపూర్. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ.. ఆర్సీ 16లో జాన్వీ ఫైనల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు చరణ్ బ్యూటీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడట ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్గా ఆలియా భట్ నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో ఒకటి అర సీన్స్‌లో ఆలియా స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ.. ఆమెను చరణ్ హీరోయిన్‌గానే చెప్పొచ్చు. ప్రియుడు కోసం వేచి చూస్తున్న ప్రియురాలిగా నటించింది ఆలియా భట్. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో ఆలియా నటిస్తుందనే మాటా వినిపించింది.
కానీ ఆ ఆఫర్ జాన్వీ కపూర్‌కు వరించింది. అయితే.. ఈ సారి మాత్రం ఎన్టీఆర్‌తో ఆలియా భట్ రొమాన్స్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. దేవర తర్వాత వార్2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో హీరోయిన్గా ఆలియా భట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. హృతిక్ రోషన్ సరసన హీరోయిన్ సంగతేమో గానీ.. ఎన్టీఆర్ పెయిర్ మాత్రం ఆలియా భట్ ఫిక్స్ అని అంటున్నారు. దీంతో ఎన్టీఆర్, చరణ్ హీరోయిన్లను మార్చుకుంటున్నారనే చెప్పాలి. త్వరలోనే వార్ 2 సెట్స్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘బ్రహ్మాస్త్ర’ ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.