Fire Accident : దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో ఈరోజు అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 22 మంది మరణించారు. చనిపోయిన వారిలో 18 మంది చైనా పౌరులు. అగ్నిమాపక శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం.. ఒకరు గల్లంతయ్యారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయని, వాటిని గుర్తించడానికి సమయం పట్టే అవకాశం ఉందని డిపార్ట్మెంట్ అధికారి కిమ్ జిన్ యంగ్ తెలిపారు. రాజధాని సియోల్‌కు దక్షిణంగా ఉన్న హ్వాసోంగ్‌లో బ్యాటరీ తయారీదారు ఎరిసెల్ నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో ఉదయం 10:30 గంటలకు మంటలు చెలరేగాయని ఆయన చెప్పారు.
35,000 యూనిట్లు ఉన్న గిడ్డంగిలో బ్యాటరీ సెల్ యూనిట్ పేలడం వల్లే మంటలు చెలరేగాయని, అయితే పేలుడుకు కారణమేమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని కిమ్ జిన్-యంగ్ చెప్పారు. సమాచారం ప్రకారం మంటలు చెలరేగినప్పుడు కంపెనీలో 67 మంది పనిచేస్తున్నారు. అగ్నిప్రమాదం చాలా తీవ్రంగా ఉందని, ఫ్యాక్టరీ బూడిదగా మారిందని చెప్పారు. ఎవరూ బతికి ఉంటారన్న ఆశ లేదన్నారు. మంటలను అదుపులోకి తెచ్చామని, అయితే మృతదేహాల కోసం గాలిస్తున్నామని చెప్పారు. కర్మాగారంలోని రెండో అంతస్తులో చాలా మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రజలు మంటలను చూసి తనకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని యంగ్ చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
BREAKING: At least 21 people killed in fire at South Korean lithium battery plant – Yonhap pic.twitter.com/PfZItgRLr7
Aricel కంపెనీని 2020లో స్థాపించారు. సెన్సార్, రేడియో కమ్యూనికేషన్ పరికరాల కోసం కంపెనీ లిథియం బ్యాటరీలను తయారు చేస్తుంది. ఎరిసెల్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, కంపెనీ దక్షిణ కొరియా స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయబడలేదు. అయితే దాని మెజారిటీ ఎన్-కనెక్ట్ యాజమాన్యంలో ఉంది. ఎన్-కనెక్ట్ జూనియర్ కోస్డాక్ ఇండెక్స్‌లో నమోదైంది.