»Industrial Robot Kills Man In South Korean Distribution Centre
Viral News: మనిషి ప్రాణాలు తీసిన రోబో
టేక్నాలజీ ఎక్కువైతే మనిషికి పనిభారం తప్పుతుందని అందరికీ తెలుసు. అందుకే అనేక దేశాలు రోబోలను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే అదే టేక్నాలజీలో ఏదైనా లోపాలు తలెత్తితే జరిగే సంఘటలు ఎంత దారుణంగా ఉంటాయో, దాని వల్ల జరిగే నష్టం ఎంత ఉంటుందో ఎవరు అంచనా వేయడం లేదు. తాజాగా ఓ రోబో మనిషిని చంపేసింది. అయితే సాంకేతిక లోపం వల్లనే ఇలా జరిగిందని నిపుణులు అంటున్నారు.
Viral News: ఈ భూమి మీద మనిషి అరుదైన ప్రాణి అని అందరికి తెలుసు. ఎందుకంటే మనిషి మాత్రమే ఆలోచించగలడు. మొదట నిప్పు కనిపెట్టిన నాటి నుంచి నేడు రోబోలను కనిపెట్టే స్థాయికి మానవుని మొదడు అభివృద్ధి చెందిందంటే మాములు విషయం కాదు. పనుల్లో సాయం కోసం మానవుడు చేసిన అవిష్కరణే ఈ మరమనిషి. వీటిని ఉపయోగించి అతి క్లిష్టమైన్ పనులను, ఫ్యాక్టరీలో రిస్క్ ఉండే పనులను చేయడం ద్వారా మనిషికి ముప్పు తప్పుతుందని అందరు భావిస్తున్నారు. అయితే ఈ రోబో(Robot)లే ప్రస్తుతం పలు చోట్ల మనిషి ప్రాణాలకు ముప్పుగా మారాయి. అవును ఇది నిజమే తాజాగా అలాంటి సంఘటనే దక్షిణ కొరియా(South Korean )లో చోటు చేసుకుంది.
40 ఏళ్ల రోబోటిక్స్ కంపెనీ ఉద్యోగి దక్షిణ జియోంగ్సాంగ్ ప్రావిన్సులోని వ్యవసాయ ఉత్పత్తులను పంపిణీ చేసే కేంద్రంలో రోబోచేత మరణించాడు. రోబోలో సెన్సార్ లోపాలు ఉన్నాయని దాన్ని రిపైర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బెల్ పెప్పర్‌తో నింపిన పెట్టెలను ఎత్తి ప్యాలెట్‌పై పెట్టే పనిని ఈ రోబో చేస్తుంది. తాను టెస్ట్ చేస్తున్న సందర్భంలోనే ఇండస్ట్రియల్ రోబోట్ వ్యక్తిని పెట్టెగా భావించింది. ఆ క్రమంలో అతన్ని ఎత్తి కన్వేయర్ బెల్ట్‌పై పడేసింది. రోబో అతన్ని బలంగా పట్టుకోవడం వలన అతని ముఖం, ఛాతి తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ వ్యక్తి ఎముకలు విరిగిపోయాయి. అది గమనించిన ఆ ఫ్యాక్టరీలోని మిగితా సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతను మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని యోన్హాప్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.