US Teacher Arrest: సమాజంలో గురువుకు ఉన్నతమైన స్థానం ఉంది. కొందరు ఆ కొలువుకు చెడ్డ పేరు తెస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో (america) కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారు. అవును ఓ టీచర్ (Teacher), విద్యార్థితో శృంగారంలో పాల్గొందట.. ఆ విషయం ఆ యువకుడు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. టీచర్‌ను అరెస్ట్ చేశారు.
గతంలో మాంట్ గోమెరి విలేజ్ మిడిల్ స్కూల్లో మెలిసా మేరీ కర్టిస్ టీచర్‌గా పనిచేసింది. 2015లో ఆ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థితో శృంగారంలో పాల్గొంది. ఆ సమయంలో టీచర్ వయసు 22 ఏళ్లు. తన కన్నా ఎనిమిదేళ్లు చిన్నవాడిని శృంగారం చేయాలని ప్రేరెపించింది. అందుకోసం మద్యం తాగించేదట.. గంజాయి కూడా ఇచ్చిందని తెలిసింది.
తన జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను విద్యార్థి గత నెలలో పోలీసులు తెలిపారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆ టీచర్‌ను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపి అరెస్ట్ చేశారు. ఆ టీచర్ బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు.
విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ నీతి తప్పింది. తన కామవాంఛ తీర్చుకునేందుకు ఏకంగా విద్యార్థి జీవితాన్ని బలిచేసింది. చిన్నతనంలో జరిగిన ఆ ఘటనతో స్టూడెంట్ జీవితం నాశనం అయ్యింది. డ్రగ్స్, మద్యానికి అలవాటు పడటంతో లైఫ్ డేంజర్ జోన్లోకి వెళ్లింది.