'లాఫింగ్ గ్యాస్(Laughing gas)'ను బ్రిటన్ దేశంలో నేటి నుంచి నిషేధించారు. దీనిని ప్రధానంగా వినోదభ కార్యకలాపాల్లో వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఈ డ్రగ్‌ను ఉపగిస్తే జైలు శిక్షను ఎదుర్కొంటారని అధికారులు పేర్కొన్నారు.
‘లాఫింగ్ గ్యాస్(Laughing gas)’ అని పిలువబడే నైట్రస్ ఆక్సైడ్ వినోద కార్యకలాపాల్లో వినియోగించడంపై బుధవారం నుంచి బ్రిటన్‌లో నిషేధించారు. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్‌ను ఉత్పత్తి చేయడం లేదా సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి కార్యకలాపాల్లో పట్టుబడిన వ్యక్తులు జైలు శిక్షను ఎదుర్కొంటారని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆరోగ్య సంరక్షణ, ఇతర పరిశ్రమలకు దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే తాజా నిబంధనల ప్రకారం ఈ నేరం చేసిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుందని ప్రకటించారు. దీంతోపాటు నైట్రస్ ఆక్సైడ్‌ను సరఫరా చేస్తే 14 సంవత్సరాల వరకు కటకటాల పాలవుతారని వెల్లడించారు. ఇటివల కాలంలో బ్రిటన్‌లో నైట్రస్ ఆక్సైడ్(nitrous oxide) దుర్వినియోగం ఎక్కువగా చేస్తున్నారు. దీంతోపాటు ఇది ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమని వైద్యులు తేల్చారు. ఇలాంటి క్రమంలో దీనిని వినియోగించడం మానాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లాండ్‌లో 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు(youth) గలవారిలో నైట్రస్ ఆక్సైడ్ వినియోగం మూడో స్థానంలో ఉంది. అంతేకాదు దీనిని సంఘవిద్రోహ ఘటనలకు కూడా ఉపయోగిస్తున్నారని తేలింది.
దీనిని అధికంగా వాడటం వలన రక్తహీనత సహా మరికొనని తీవ్రమైన సందర్భాల్లో నరాల బలహీనత లేదా పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నైట్రస్ ఆక్సైడ్ “క్లాస్ సి” డ్రగ్‌గా సూచించబడుతుంది. బ్రిటన్(britain) చట్టాల ప్రకారం అనాబాలిక్ స్టెరాయిడ్స్, బెంజోడియాజిపైన్స్, గ్రోత్ హార్మోన్లతో పాటుగా “అత్యల్ప హానికరమైన” మందుల విభాగంలో వర్గీకరించబడుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో బ్రిటన్ అంతర్గత మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో డ్రగ్స్ వాడకంతో ప్రజలు “విసిగిపోయారని”, బ్రిటన్ వీధుల్లో విస్మరించబడిన గ్యాస్ డబ్బాలు కుప్పలు కుప్పులుగా ఉన్నాయని అన్నారు.