»Hyderabad Deo Bans Sale Of Uniforms Books And Belts In Private Schools
BAN : ఇకపై ఇక్కడ ప్రైవేట్ స్కూళ్లలో యూనీఫాం, బూట్లు అమ్మడంపై నిషేధం
ప్రైవేట్ స్కూళ్లలో యూనీఫాంలు, బెల్టులు, బూట్లు లాంటివి అమ్మడంపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Private Schools : పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్న వేళ హైదరాబాద్ విద్యాశాఖ నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రైవేటు స్కూళ్లలో ఇక మీదట బెల్టులు, బూట్లు, యూనీఫాం… తదితరాలను అమ్మకూడదని హైదరాబాద్ డీఈఓ(Hyderabad Deo) ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిషేధం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న స్కూళ్లకేనా, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకూ వర్తిస్తుందా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
కోర్టు ఆదేశాలను పేర్కొంటూ డీఈఓ ఓ ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలో పుస్తకాలు, స్టేషనరీ లాంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపారు. ఒక వేళ ఏ పాఠశాలను ఈ నిబంధనలను అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రైవేటు స్కూళ్లను(Private Schools) పరిశీలించడానికి మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అందరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. స్కూలు యాజమాన్యాలు యూనీఫాంలు, బెల్టుల్లాంటి వాటిని విక్రయించకుండా చూడాలని వారికి మార్గదర్శకాలు జారీ చేశారు. ఒక వేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమించి ఆ పనులు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.