భారతదేశానికి చెందిన 71.1 లక్షల వాట్సాప్ ఖాతాలను సెప్టెంబర్ నెలలలో బ్యాన్ చేశామని కంపెనీ పేర్కొంది. 50 లక్షల యూజర్లు ఉన్న సోషల్ మీడియా నెలవారీ రిపోర్ట్ వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం కోరగా.. ఈ మేరకు రిపోర్ట్ వెల్లడించింది.
71 Lakh Indian Accounts Ban: భారతదేశంలో 71.1 లక్షల వాట్సాప్ (Whatsapp) అకౌంట్లపై నిషేధం విధించినట్టు కంపెనీ పేర్కొంది. భారత ఐటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నామని తెలిపింది. 25.7 లక్షల ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని వివరించింది. సెప్టెంబర్లో యూజర్ల నుంచి 10 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని వాట్సాప్ తెలిపింది. స్పామ్ ఖాతాలకు సంబంధించి ఫిర్యాదులు, ఖాతాలపై నిషేధం, ప్రొడక్ట్ సపోర్ట్ వంటివి ఉన్నాయని చెప్పింది.
యూజర్లు ఫిర్యాదు చేసే ఖాతాలపై యూజర్ సేప్టీ రిపోర్ట్ ఆధారంగా వాట్సాప్ ఏఐ సాంకేతి వ్యవస్థ చర్యలు చేపట్టిందని తెలిపింది. నిబంధలను విరుద్ధంగా వ్యవహరిస్తూ.. అసత్యాలను ప్రచారం చేస్తోన్న ఖాతాలను తొలగించామని చెబుతోంది. భారతదేశానికి చెందిన ఖాతాలుగా కొనసాగుతూ.. +91 కోడ్ లేని ఖాతాలను కూడా బ్యాన్ చేశామని స్పష్టంచేసింది.
యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వారి వ్యక్తిగత డేటాకు భంగం కలిగించకుండా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్తో భద్రత కల్పిస్తున్నామని తెలిపింది. భారత ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు ఉన్న ప్రతి సోషల్ మీడియా కంపెనీ నెలవారీ రిపోర్ట్ వెల్లడించాలని పేర్కొంది. యూజర్ల నుంచి వచ్చే కంప్లైంట్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అందులో పొందుపరచాలి. అందులో భాగంగా వాట్సాప్ తాజా నివేదికను రూపొందించింది.