ములుగు మండలం అబ్బపూర్ గ్రామంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తప్పెట్ల రాజేందర్ ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లను రోడ్డుపైనే కాలు పట్టుకుని వేడుకున్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. దీంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.