ASR: అనంతగిరి మండలంలోని బీసుపురం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. సుమారు 40 మంది విద్యార్థులు ప్రమాదకర భవనంలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. గోడలు, పూర్తిగా దెబ్బతిన్నాయి. వంట షెడ్, మరుగుదొడ్లు కూడా నిరుపయోగంగా మారాయి. ప్రమాదం పొంచి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన భవనం నిర్మించాలని కోరుతున్నారు.