KMM: ముదిగొండ మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్దమండవ గ్రామంలో 10 గంటల వరకు 40 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.