హైదరాబాద్ వేదికగా అఖిలేష్ యాదవ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో గెలవడానికే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'(SIR) తెచ్చారని, ఇది బ్యాక్‌డోర్ పాలిటిక్స్ అని విమర్శించారు. యూపీలో 3 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ‘రాజకీయాలంటే విజన్.. డివిజన్ కాదు’ అని చురకలు అంటించారు. ఆధార్‌ను ఓటరు లిస్టుతో ఎందుకు లింక్ చేయట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.