»Pm Narendra Modi Meditates At The Vivekananda Rock Memorial
PM Modi : ఎన్నికల ప్రచారం ముగియడంతో సాధువులా మారిన మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్లిపోయారు. కాషాయ వస్త్రాలు ధరించి సాధువులా మారారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ఆయన 45 గంటల పాటు ధ్యానంలోనే ఉండనున్నారు.
Pm Narendra Modi : ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో బిజీ బిజీగా గడిపిన ప్రధాని నరేంద్ మోదీ(Pm Narendra Modi) ఇప్పుడు ప్రశాంతంగా ధ్యానం చేసుకునేందుకు ఉపక్రమించారు. కన్యాకుమారిలో 45 గంటల పాటు ఆయన ధ్యానం చేసుకోనున్నారు. అందుకు ఆయన కాషాయ వస్త్రాలు ధరించి, నుదుటన విభూతి ధరించి సాధువు వేషంలో దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్లో వైరల్‌గా మారాయి.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడి వివేకానంద రాక్‌మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్ద ధ్యానం చేసుకోవడానికి ఉపక్రమించారు. దాదాపుగా రెండు రోజుల పాటు ఆయన అక్కడ ధ్యానం (Meditation)లో ఉండనున్నారు. దీంతో ఆ చుట్టు పక్కల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
వివేకానందుడి జీవితంలో కన్యాకుమారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన దేశమంతా తిరుగుతూ కన్యాకుమారి చేరుకుని ఇక్కడ శిలపైన కూర్చుని ధ్యానం చేసుకున్నారు. అప్పుడే ఆయనకు జ్ఞానోదయం అయినట్లు ప్రతీతి. దాన్నే రాక్ మెమోరియల్‌గా ఇప్పుడు పిలుస్తున్నారు. ఇంత విశిష్టమైన ప్రదేశాన్ని మోదీ ధ్యానం చేసుకోవడానికి ఎంచుకున్నారు. ఆయన 2019 ఎన్నికల ప్రచారం తర్వాత కూడా కేదార్‌నాథ్‌ను సందర్శించారు.