»Us Election 2024 Donald Trump Is Convicted On All 34 Charges Now What
TRUMP : ఇక ట్రంప్ పని అయిపోయినట్లేనా? 34 కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముందున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. మొత్తం 34 కేసుల్లో ట్రంప్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
If you don't win me as the president of America, it will be bloody.. Donald Trump
DONALD TRUMP : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో గట్టి దెబ్బ తగిలింది. ఆయనకు సంబంధించిన మొత్తం కేసుల్ని 9.5 గంటల సేపు విచారించిన కోర్టు ఆయనను 34 కేసుల్లో దోషిగా ధ్రువీకరించింది. దీంతో అగ్రరాజ్యం అమెరికా(US) చరిత్రలోనే ఇంతటి అపఖ్యాతి మూటగట్టుకున్న మాజీ అధ్యక్షుడిగా, అధ్యక్ష అభ్యర్థిగా ఆయన నిలిచారు.
సుదీర్ఘమైన న్యాయ విచారణ తర్వాత తీర్పు వెలువరించే సమయంలో ట్రంప్(TRUMP) అక్కడే ఉన్నారు. ఆయన ముఖంలో ఎలాంటి హావ భావాలు లేవు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న వారు మాత్రం ఆ ప్రాంగణంలో కేరింతలు కొట్టారు. ఆనందంతో అక్కడ సంబరాలు చేసుకున్నారు. అయితే కోర్టు చివరికి ట్రంప్‌కు ఏ శిక్ష విధిస్తుంది? అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ట్రంప్ మాత్రం తాను అమాయకుడునని ఏ తప్పూ చేయలేదని న్యాయ పోరాటం కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు.
ట్రంప్‌కు(TRUMP) అనేక నేరాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. ట్రంప్ గతంలో కొంత కాలం స్టార్మీ డేనియల్‌తో ఏకాంతంగా గడిపారని ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆమె బయట పెట్టకుండా ఉండేందుకు 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో భారీగా డబ్బు ముట్ట జెప్పారని అభియోగం ఉంది. ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమాల నుంచి అందిన విరాళాల నుంచి ఆ డబ్బును ఆమెకు ఇచ్చారనే వాదన ఉంది. అందుకోసం ఆయన పెద్ద ఎత్తున తన బిజినెస్ రికార్డులన్నీ తారుమారు చేశాని తెలుస్తోంది.
ఆ కేసుతో పాటు మరిన్ని కేసుల్ని విచారించిన కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఆయనకు ఏ శిక్ష విధించాలన్న విషయంలో న్యాయస్థానం ఆలోచనలో పడింది. వచ్చే జులై 11న ఆయనకు శిక్ష ఖరారు కానుంది. ఒక వేళ ఆయనకు జైలు శిక్ష పడితే మాత్రం ఓటు వేసే హక్కును కోల్పోతారు. ఆయనకు జైలు శిక్ష లేదంటే జరిమానా విధించే హక్కు కోర్టుకు ఉంది. కాబట్టి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది? అనేదానిపై అభిప్రాయానికి రాలేమని నిపుణులు చెబుతున్నారు.