Overripe Bananas : చాలా మందికి కాస్త ఎక్కువ ముగ్గిన అరటి పండ్లను తినడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అయితే వాటిల్లో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే మనకు నిజంగానే షాకింగ్‌గా ఉంటుంది. అవి తినడం వల్ల మన శరీరానికి అనేక రకాల లాభాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే వీటిని అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. అయితే వీటిని రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి. అంతకు మించి తినడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయని గుర్తుంచుకోవాలి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతిగా తినడం వల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం లాంటివి కలుగుతాయి. ఇక బాగా పండిన అరటి పండ్లను(BANANAS) తినడం వల్ల కలిగే లాభాలు( BENEFITS) ఏంటో తెలుసుకుందాం.
బాగా పండిన అరటి పండ్లను(BANANAS) తినడం వల్ల క్యాన్సర్ రోగులకు ఎంతో మేలు కలుగుతుంది. అరటి తొక్కల్లో ఉండే ఒక పదార్థాన్ని ట్యూమర్ నెక్రొసిస్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అది అసాధారణంగా పెరిగే కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఈ విషయం కొన్ని అధ్యయనాల్లోనూ వెల్లడైంది. క్యాన్సర్ కణాలు, ఇతర కణాల పెరుగుదలను ఇది నిలుపుదల చేస్తుంది. కాబట్టి వీటిని తింటూ ఉండటం వల్ల క్యాన్సర్ ముప్పు కొంత వరకు తగ్గుతుంది.
జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న వారు ఇలా మగ్గిన అరటిపండ్లను(BANANAS)త తినడం వల్ల అరుగుదల బాగుంటుంది. బాగా పండిన తర్వాత ఈ పండు స్టార్చ్ ఫ్రీ షుగర్‌గా మారుతుంది. కాబట్టి తేలికగా జీర్ణం అవుతుంది. ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు ఇలాంటి పండును తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి వెంటనే అందుతుంది. అలాగే గుండెల్లో మంటగా అనిపించినప్పుడు దీన్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీని నుంచి వచ్చే యాసిడ్లు మంటను తగ్గిస్తాయి. ఇంకా ఇవి గుండె పని తీరును మెరుగుపరుస్తాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కొలస్ట్రాల్ సైతం తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవి సహాయపడతాయి.